ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 07, మహానంది:
క్రీస్తు శిలువ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని ప్రత్యేక సందేశకులు ఫాదర్ రాజ్ కుమార్ అనే అన్నారు. శుక్రవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా విలియం, ప్రతాప్,గాలిబాలసుబ్రమణ్యం, మాజీ సర్పంచ్ గాలి ప్రకాశం,జానకి రాముడు, ఆధ్వర్యంలో శిలువ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఫాదర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్న గుడ్‌ఫ్రేడే ద్వారా ఏసు క్రీస్తూ శిలువలో పలికిన ఏడు మాటలు ద్వారా క్షమా గుణం, బాధ్యత, ప్రేమ, పాపపు ఒప్పుకోలు, దయా గుణాలను అలవర్చు కోవాలన్నారు. పాపుల కోసమే ఏసూ క్రీస్తు ఈ లోకంలో జన్మించి, శిలువలో రక్తం చిందించి ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు. పాపపు జీవితాన్ని వదలి క్రీస్తు చూపిన మార్గంలో నడిచి పరలోకం చేరాలని బోధించారు. ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగుల శిక్షణ కేంద్ర నిర్వాహకులు రీనా సిస్టర్, ఫాతీమ, ఫ్రాన్సేస్, హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.