చేవెళ్ల మండల కేంద్రంలోని సోమవారము రోజున తొలి తెలంగాణ అమరుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలు చేవెళ్ల కురుమ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు… చేవెళ్ల కురువ సంఘం అధ్యక్షుడు కసిరే వెంకటేష్ మాట్లాడుతూ… తెలంగాణలో భూ స్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. ఆయన జయంతిని ఏప్రిల్ 3న, వర్థంతిని జూలై 4న అధికా గోరికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేది. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు. తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు.. ఈ కార్యక్రమంలోని,ఉపాధ్యక్షులు దండు సత్తి, ఎర్ర మల్లేష్,సాయినాథ్, జనరల్ సెక్రెటరీ తిరుమల కుమార్, ఎంపిటిసి గుండాల రాములు, సర్పంచ్ నరసింహులు, కురువ పాండు,చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ , కమిటీ సభ్యులు, మల్లేష్, మహేందర్ గుత్తి మల్లేష్, రాములు, శ్రీనివాస్, సత్యం, వెంకటేష్, సిద్దయ్య, పరిగి నరసింహులు, బర్ల కృష్ణ టేకులపల్లి మల్లేష్, ప్రవీణ్, బాల్రాజ్, మాణిక్యం,తదితరులు పాల్గొన్నారు