గొట్టుముక్కుల్లో వైభవ కళ్యాణ ఉత్సవం పాల్గొన్న సర్పంచ్ వెంకటేశం దంపతులు,గ్రామస్తులు

సీతమ్మను మనువాడిన రామయ్య…

గొట్టిముక్లలో వైభవంగా కళ్యాణోత్సవ వేడుక

వికారాబాద్, ప్రతినిధి

వికారాబాద్ జిల్లా గొట్టిముక్కల గ్రామంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.గురువారం ఉదయం స్వామి వారి విగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరేగింపు తీశారు.ఉరేగింపులలో పల్లకి సేవ నిర్వహించగా పల్లికి సేవ మెసేందుకు యువకులు అధికసంఖ్యలో పోటీ పడ్డారు.శ్రీసీతారాములు శ్రీ సీతారాముల దేవాలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 12 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా..లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు హారతులు పట్టారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది.కల్యాణం అనంతరం భక్తులు స్వామి వారిపై అక్షింతలు చల్లి భక్తితో కొలిచారు.భక్తులు స్వామి వారి కల్యాణం కట్నాలు చదివించారు.ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. రామనామస్మరణతో గొట్టిముక్కల గ్రామం మారుమ్రోగింది.కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు.కల్యాణం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కల్యాణ వేడుకల్లో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్,ఎంపిటిసి గోపాల్,గ్రామ ఉప సర్పంచ్ మల్లేశం,గ్రామ పెద్దలు మోత్కూర్ బాల్ రాజ్,మాణిక్య రెడ్డి,సాయన్న,నాగప్ప,లక్ష్మయ్య,నర్సిహులు, శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!