స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 27
గిద్దలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొదిలికొండ పల్లెలో 10.వతరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు, స్కేల్లు, పెన్నులు, రబ్బర్లు, పెన్సిల్లు, మెండర్లు మొదలైన పరీక్ష సామాగ్రిని యడవల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ మొర్రి.పిచ్చయ్య తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసి పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొర్రా.వెంకటరత్నం మాట్లాడుతూ పరీక్షల విధి విధానాలను వివరించి, విద్యార్థులందరు నూరు శాతం ఉత్తీర్ణత సాధించుటకు తగిన సూచనలు తెలియజేశారు. దాత డాక్టర్ మొర్రి.పిచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తానని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ప్రధానోధ్యాయులు బొర్రా.వెంకట రత్నం, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని దాత డాక్టర్ మొర్రి పిచ్చయ్య ను అభినందించగా, విద్యార్థులు దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు.