వికారాబాద్ జిల్లాలోని పట్టణంలోని మాణిక్ నగర్ ఎం సి టి కాలనీ పాత తాండూర్ లలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.
ఈ సమావేశానికి పొలిట్ బ్యూరోసభ్యులు రాష్ట్ర పార్టీ అబ్జర్వర్ బక్కని నర్సింహులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు గూడెం సుభాష్ యాదవ్, తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సూరజ్ సింగ్ ఠాగూర్ , చేవెళ్ల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి,పరిగి నియోజకవర్గం ఇంచార్జ్ చంద్రయ్య, వికారాబాద్ ఇంచార్జి దివాకర్ రెడ్డి,
హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సంకల్పానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ దున్నేవాడిదే భూమి అని ఆడ పిల్లలకు సమాన హక్కుల్ని కల్పించడమే కాకుండా మహిళల అభ్యున్నతికోసం డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి ఇలా అనేక సంక్షేమాలని అభివృద్ధిని
సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ వాళ్లు నీళ్లు నిధులు నియామకాలు అని మోసపురితమైన హామీలతో గద్దెనెక్కి నేడు వాటికి పూర్తి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అప్పటికి ఇప్పటికీ పేదలకు అండగా వుండేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కరపత్రాలని ఇంటింటికి పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.