మహానంది దేవస్థానంలో తాగునీటి నిర్వహణపై భక్తుల ఆగ్రహం.
మహనందికి వచ్చే భక్తులకు త్రాగునీటి కష్టాలు.
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 26, మహానంద:
ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో ప్రజలు,కర్ణాటక భక్తులు త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.ఎమ్మెల్యే గారు మహనందిలో నీటి కష్టాలు జర చూడండి అని స్థానికులు వేడుకుంటున్న పరిస్థితి.మహనంది క్షేత్రంలో మోటార్ మరమ్మత్తు ఉండడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
వేసవి కాలంలో మహనందికి వచ్చే భక్తులు తాగేందుకు నీరు లేకపోవడంతో డబ్బు పెట్టి నీళ్లను కొనుగోలు చేస్తున్నారు.మహనందిలో 100 గదుల భూమి పూజకు వస్తున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు కాసింత మహనందిలో నీటి కష్టాలను విచారణ చేయాలని భక్తులు,స్థానికులు కోరుతున్నారు.మహనందిలో నేటికీ దేవాలయంలో ఎవరు కనుగొనలేని నీటి దార నుంచి వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి.ఎంతో మహిమ గల మహనందిలో భక్తులు, నీటి సమస్య ఉందని ప్రజలు చెప్పుకోవడం నేతలకు,అధికారులు ఓ సారి ఆలోచించండి. మహానంది క్షేత్రంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు దేవస్థానం వారు ప్రసాదాల కౌంటర్ల సమీపంలో శుద్ధి జల త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుండి భక్తులకు త్రాగునీటి కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. శుద్ధి జల ట్యాంకుల వద్ద నీరు రాకపోవడంతో భక్తులు వెను తిరుగుతున్నారు. దీంతోపాటు శుద్ధి జల ట్యాంకుల నిర్వహణలోప కారణంగా ట్యాంకుల్లో ఇనుప వస్తువులతో పాటు తుప్పు, దుమ్ము ధూళి, సన్నటి పురుగులు కూడా తాగునీటిలో దర్శనమిస్తున్నట్లు విమర్శలు వెలుగుతున్నాయి. భక్తులకు కనీసం త్రాగునీరు అందించే స్థితిలో ఆలయ అధికారులు లేరా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ట్యాంకుల నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా శుభ్రం చేశారా అనేది భక్తుల ప్రశ్న. శుభ్రం చేస్తే ఇవి అన్ని ఎలా ట్యాంకులో ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు వివక్షత చూపుతున్నారని కనీసం వాటి నిర్వహణ ఇతర వాటిపై దృష్టి కేంద్రీకరించలేక పోవడం పై భక్తులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు అధికారులు సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సి ఉంది.