స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 26
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో కంభం పట్టణానికి చెందిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, వైసీనిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి గారు వారికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మంకు శ్రీనివాసులు, సోమిశెట్టి మురళీ, ఐతా కృష్ణ, గోనుగుంట్ల రంగయ్య, నూనె శ్రీనివాసరెడ్డి మరియు కంభం మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.