స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 25
గిద్దలూరు మండలం రేషన్ పంపిణీ వాహనదారులు మండల తాసిల్దార్ మర్యాదపూర్వకంగా కలిసి ఎం డి యు వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ గవర్నమెంట్ కడతాదని చెప్పినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా వారు తను ఇష్ట అనుసారంగా ప్రతి ఒక్క ఎండియు ఆపరేటర్ కి సుమారు 18 వేల రూపాయల నుండి 23000 వరకు మైనస్ల్లో పెట్టి జీతం పడిన వెంటనే ఆ అమౌంట్ను కట్ చేయడం జరిగింది తక్షణమే మా అమౌంట్ మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము
రాష్ట్రవ్యాప్తంగా ఎండియూ ఆపరేటర్స్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మరియు అనారోగ్యంతో సుమారు 57 మంది చనిపోవడం జరిగింది వారికి తక్షణమే ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించి వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవాలని అలాగే ఎండియు ఆపరేటర్స్ అందరికీ ప్రమాద బీమా కల్పించాలని విన్నవించుకుంటున్నాం
గత రెండు సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను తక్షణం విడుదల చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రార్థన.
ఐసిడిఎస్ ఎం.డి.యం గత 5 నెలలుగా పంపిణీ చేసిన శాలరీ ఇంతవరకు పడలేదు వీలైనంత త్వరగా ప్రభుత్వం నుంచి వచ్చే లాగా సహకరించగలరు.
బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ మేనేజర్లు కొన్ని శాఖలలో వ్యక్తిగత ఖాతాల నుండి కట్ అయిన అమౌంట్ను రీఫండ్ చేయడం లేదు. ఉన్నత అధికారులు బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి లెటర్ పూర్వకంగా ఇచ్చినప్పటికీ వారు మా యొక్క వ్యక్తిగత ఖాతా నుండి అమౌంటు కట్ చేస్తున్నారు ఆ అమౌంట్ ఈ నెలాఖరులోగా మా ఖాతాలో జమ కాకపోతే ఏప్రిల్ నెల ఒకటో తారీకు నుండి మేము విధులు కొనసాగించలేము
హమాలిలకు, వెహికల్ పెట్రోల్ కు, హెల్పర్ జీతం* ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము సంబంధిత బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి కట్ అయిన అమౌంట్ను తిరిగి ఇప్పించవలసిందిగా కోరుడమైనది.
ఈ కార్యక్రమంలో మండల ఎం డి యు యూనియన్ ప్రెసిడెంట్లు సభ్యులు పాల్గొన్నారు