వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ రైల్వే స్టేషన్ లో వికారాబాద్ జిల్లా DTF టీం వికారాబాద్ మరియు వికారాబాద్ ఎస్ హెచ్ ఓ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో ఒక వ్యక్తి పట్టుబడ్డాడని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర తెలియజేశారు. అతని దగ్గర సుమారు 25 కిలోల గంజాయి లభ్యమయిందని, అతని పేరు బాసు కుంభాకర్ పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు అతనిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.