రజకులకు జగన్ ప్రభుత్వం ఏమి చేసింది
రజకులను ఎస్సీ జాబితాలో కలపాల్సిందే
రజకులకు ఎస్సీ ఎస్టీ తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి
లేనిపక్షంలో రజక ఉద్యమం తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి కి సవాల్ విసిరిన రజక విద్యార్థి, యువజన, సంఘం (RSYF)రాష్ట్ర అధ్యక్షుడు డి చిన్న
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 24, నంద్యాల:
రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు ఎటువంటి రకంగా ఉపయోగపడకపోగా రజకులు అవమానాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఈ జగన్ ప్రభుత్వంలో వచ్చిందని రజక విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు(RSYF) డి చిన్న ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రజకులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయాన అధికార పార్టీకి చెందిన వైసిపి ఎమ్మెల్యేల చేత రజకులను అవమానాల పాలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే చెందిందని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం బీసీ కులాల వారికి రజకులకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చిన్న డిమాండ్ చేశారు. ఉదాహరణకు గత టిడిపి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ నిధులతో పాటు రజక ఫెడరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకు ద్వారా ప్రతి 15 మందికి లోన్ ఇప్పించడం అలాగే ఆదరణ పథకం ద్వారా ఒక్క రజక కులానికే కాక కులవృత్తి చేసే వారికి అందరికీ ఆసరాగా నిలబడిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వానికే చెందిందని ఆయన తెలుపుతూ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా తయారైందని అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రజక ఫెడరేషన్ ను రజక కార్పొరేషన్ గా మార్చిందే తప్ప ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా రజకుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఉందని అంతేకాక రజక కార్పోరేషన్ చైర్మన్ ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయని ఆయన డిమాండ్ చేస్తూ గతంలోనే స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రజకులకు 343 జీవో పాస్ చేసి వృత్తిపరమైన చెరువులను కేటాయించాల్సిన హామిని ఇంతవరకు కూడా నెరవేర్చలేదు అలాగే ధోబి గాట్ల హామీని కూడా ఇంతవరకు నేరవేర్చలేదని ఆయన మండిపడ్డారు కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రజకుల పక్షాన నిలబడి రజకులకు రావలసిన రజక కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేసి రజకులను ఎస్సీ జాబితాలో కలపాలని రజక విద్యార్థి యువజన(RSYF) రాష్ట్ర అధ్యక్షుడు డి చిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త రజక ఉద్యమానికి శ్రీకారం చుట్టి వచ్చే ఎన్నికలలో చిత్తుగా పరాజయం చేస్తామని డిమాండ్ చేశారు.