క్షయవాదిపై అవగాహన ర్యాలీ
క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం
జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయం
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 24, మహానంది;
క్షయ వ్యాధి ని నిర్మూలిద్దాం దేశాన్ని కాపాడుదాం అని ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కే ఎస్ పి శ్రీనివాసులు, డాక్టర్ వెంకట రెడ్డి అన్నారు.మహానంది మండలంలోని గాజులపల్లె గ్రామంలో జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవo సందర్బంగా ప్రాధమిక ఆరోగ్యం నుండి పాఠశాలలు మరియు గ్రామంలో జాతీయ క్షయ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్యాధికారులు, సిబ్బంది శుక్రవారం ర్యాలీనీ నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ఈ క్షయ వ్యాధి సకాలంలో చికిత్స తీసుకుంటే నయం అవుతుందని భయపడాల్సిన పనిలేదని మాత్రలు ఉచితంగా ఇస్తారని గళ్ళ పరీక్షలు ఉచితంగా చేస్తారని అని అన్నారు.క్షయ వ్యాధిని అంత మొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పెంచలమ్మ, సి హెచ్ ఓ, హుస్సేన్ రెడ్డి, ఎం పి హెచ్ ఈ ఓ విజయ లక్ష్మీ, పి హెచ్ ఎన్,ఎల్ రమేష్ బాబు, ఎం పి హెచ్ ఏ కుమారి, సుధామణి ఎం ఎల్ హెచ్ పి లు సుధారాణి, దుర్గాదేవి ఏ ఎన్ ఎం, ఆశాలు పాల్గొన్నారు. అలాగే మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవo ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ జి రవికృష్ణ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. గ్రామంలో జాతీయ క్షయ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయరాదని, ఆ ఉమ్మిలో బ్యాక్టీరియా 24 గంటలు జీవించి ఉంటుందని, అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. రెండు వారాల మించి దగ్గు, జ్వరము ,ఆకలి మందగించడం ,బరువు తగ్గడం ,చాతిలో నొప్పి, దగ్గినప్పుడు గల్లలో రక్తం రావటము, లక్షణాలు కనబడితే వెంటనే టీబీ పరీక్షలు చేసుకోవాలని కోరారు. నంద్యాల జిల్లాలో 34129 మందికి క్షయ పరీక్షలు నిర్వహించగా 3682 మందికి రోగ నిర్ధారణ అయిందని, అందులో 51 మందికి మొండి క్షయగా గుర్తించారని, జిల్లాలో 1950 మంది రోగులకు పౌష్టిక ఆహారం అవసరమని, ఇందులో 3 92 మందికి 137 మంది దాతల ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నామని, మిగిలిన వారికి దాతల ద్వారా పౌష్టిక ఆహారం అందించాలన్నారు. తిమ్మాపురం ప్రాథమిక కేంద్రం పరిధిలో 47 మంది క్షయ వ్యాధులు ఉన్నారని, వీరందరికీ నంద్యాల డాక్టర్స్ దత్తత తీసుకొని వీరికి పౌష్టిక ఆహారం అందిస్తున్నారని, గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 20 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ మరియు లెప్రసి ఆఫీసర్ బాలాజీ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రిల్ల, తిమ్మాపురం ప్రాథమిక వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, రూపేంద్ర నాథ్ రెడ్డిలు, ఉమెన్స్ వింగ్ డాక్టర్ వసుధ, డాక్టర్ నాగమణి, డాక్టర్ అరుణ, డాక్టర్ శిల్ప, డాక్టర్ నర్మదాలు పాల్గొన్నారు.