కేశంపేట: గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వివరాల్లోకి వెలితే.. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన చాకలి పెంటయ్య(70) గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని పీఏసీఎస్ కొత్తపేట వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీటీసీ దిద్దెల లక్ష్మమ్మలక్ష్మయ్య జెడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన జెడ్పీటీసీ తక్షణ సహాయంగా రూ.5వేల నగదును పంపించారు. దీంతో నగదును మృతుని కుటుంబ సభ్యులకు పీఏసీఎస్ కొత్తపేట వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీటీసీ దిద్దెల లక్ష్మమ్మలక్ష్మయ్య అందజేశారు. అధైర్య పడవద్దని మృతుని కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావాలి వెంకటేష్, ఉపాధ్యక్షులు దిద్దెల సురేందర్, సీనియర్ నాయకులు గోగు నారాయణ రెడ్డి, పాలబూత్ శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్(చిన్న) తదితరులు పాల్గొన్నారు.