సైకో పాలను తరిమి కొట్టడానికి యువత సైనికులుగా మారాలి-టిడిపి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 20, మహానంది:
రాష్ట్రంలో సైకో పాలను తరిమి కొట్టడానికి యువత ఓటు అనే వజ్రాయుధంతో ఒక సైనికుడిగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని శ్రీశైలం నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త రామలింగారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో టిడిపి విజయకేతనం ఎగురవేయడంతో మహానంది మండలంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వర స్వామి వాళ్ళను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతున్నదని, ఈ సైకోను తరిమికొట్టడానికి యువత ఇప్పటికే సన్నదమయ్యారని, ఎమ్మెల్సీ స్థానాలలో జరిగిన ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను గెలిపించి వైసిపి పార్టీకి తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలలో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినప్పటికీ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 జరిగే ఎన్నికలలో యువత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నికలలో టిడిపిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధు యూనిట్ ఇన్చార్జీలు చంద్రమౌలేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కాకర్ల శివ, తెలుగు రాష్ట్ర యువ నాయకుడు కాంతు, నియోజకవర్గ ఐటీడీపీ ఇన్చార్జి నాగ శేఖర్, మండల నాయకులు గడ్డం నాగ పుల్లయ్య, అబ్దుల్, వెంకటేశ్వర్లు, రాముడు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, అశోకు, అనుముల శివ, తదితరులు పాల్గొన్నారు.