వికారాబాద్:హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ చేయడం జరిగింది. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు మూసేవేసినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. దీంతో వికారాబాద్ జిల్లాలోనీ వైన్స్ షాపులు మూత పడగా బెల్టు షాపులలో బ్లాక్ దందా జోరుగా సాగుతోంది. ఏ గల్లి తిరిగినా ఏ పల్లెకు వెళ్లి చూసినా బెల్టు షాపులే దర్శనమిస్తున్నాయి. ఇష్టా రాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న అబ్కారీ శాఖ అధికారులకు బెల్టు షాపులు కానరావడం లేదా అని పలువురు మండి పడుతున్నారు. వైన్స్ షాపులు మూత పడ్డంత మాత్రాన మద్యం లభించదనేది పచ్చి అబద్ధమని స్పష్టమవుతుంది.