అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వివి కండ్రిక పంచాయతీలో, బుధవారం సాయంత్రం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఐద్వా, నాయకురాలు వెంకటమ్మ ఆధ్వర్యంలో, సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం దశలవారీగా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామని, అమలు చేయకుండా,మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హామీనిఅమలు కోసం మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. మద్యం ధరలు పెంచి, కూలీల డబ్బులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా, మహిళలకు సమానత్వం రాలేదని, విద్యా ఉద్యోగం రాజకీయ రిజర్వేషన్లు 33 శాతం బిజెపి ప్రభుత్వం నేటికీ పార్లమెంట్లో చట్టం చేయలేదని మోసం చేసిందని విమర్శించారు. సిపిఎం పోరాట పలితంగా, ఉపాధి హామీచట్టం వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం, నిధులు తగ్గించి, చట్టాన్ని నీరీవీర్యం చేస్తుందన్నారు .గ్రామీణ మహిళలకు కూలి వ్యత్యాసం చేస్తున్నారని తెలిపారు, అనేక పోరాటాల ఫలితంగా, రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు, జ్యోతిరావు పూలే, లాంటి సంఘసంస్కరణ వలన, మహిళలకు హక్కులు సాధించబడ్డాయన్నారు. 14 గంటల పనిని 8 గంటల హక్కు కోసం పోరాడిసాధించారు, సతీ సహగమనం నిషేధం జరిగినది. ఓటు హక్కు సాధించడం జరిగిందన్నారు. అయినా నేటికీ, బాలిక భ్రూణ హత్యలు, జరుగుతున్నాయని, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆస్తి హక్కు లేకపోవడం, వివక్షత గురవుతున్నారని, ఆత్మగౌరవం కోసం సమాన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి జాన్ ప్రసాద్, సిపిఎం నాయకులు బొజ్జ.శివయ్య, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, మాజీ సర్పంచి నారాయణ, మరియు మల్లయ్య, కెవిపిఎస్ నాయకులు డమ్ము,శివశంకర్, సిఐటియు నాయకులు శివయ్య ఆచారి తదితరులు,పాల్గొన్నారు.