ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా ఎమ్మార్పీఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ అత్యవసర సమావేశాన్ని స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రంలో డి ఆర్ డి ఏ సమాఖ్య భవన్లో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాదిగ గారు హాజరైనారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6 వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ చౌరస్తా నుంచి పాదయాత్రగా ప్రారంభమై జాతీయ రహదారి గుండా వివిధ గ్రామాలలో ఉండే మాదిగ పల్లెలను చైతన్య పరుస్తూ.. బిజెపి ప్రభుత్వంపై నిరసన నిరసిస్తూ మార్చి 15న తెలుగు రాష్ట్రాల రాజధానుల ముట్టడి కార్యక్రమం లక్ష్యంగా కొనసాగే ఈ పాదయాత్ర పరిగి మీదుగా మన్నెగూడ చేవెళ్ల శంకర్పల్లి మీదుగా రంగారెడ్డి జిల్లాలో కలిసే రూట్ మ్యాప్ నిర్ణయించుకోవడం జరిగింది.
పాదయాత్ర ముఖ్య ఉద్దేశం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు పదేపదే మేము గనుక అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు కట్టుబడి ఉంటామని హామీలు ఇవ్వడం జరిగింది 8 సంవత్సరాలు దాటిన ఆ సమస్యను పెడచెవును విడతనే ఉంది కావున వచ్చే ఎన్నికల లోపు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని ఎన్నికలకు రావాల్సిందిగా మీకు డిమాండ్ చేస్తూ ఒకవేళ అది జరగని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలను తిరగనివ్వమని చెప్పేసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మహాజన సోషలిస్టు పార్టీ సీనియర్ నాయకులు స్వామి దాస్ మల్లేష్ పుష్పలత అప్పగల రమేష్ సుభాష్ శ్రీనివాస్ నవపేట్ ఆనంద్ శ్రీశైలం లాజరస్ డప్పు మోహన్ మాదిగ బాబురావు మాదిగ తానం నర్సింలు మాదిగ ప్రకాష్ బి కృష్ణ డప్పు జగన్ తదితరులు పాల్గొన్నారు