స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ మార్చ్ 2-౦3-23,
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అంగన్వాడి టీచర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి సీఐటీయూ జిల్లా సహ కార్యదర్శి రాజేందర్ గురువారం డిమాండ్ చేశారు.అనంతరం అంగన్వాడీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా సహా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ గత30 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు అంగన్వాడీలు అని అన్నారు.వీరికి కనీస వేతనం పెన్షన్స్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి కూడా ప్రభుత్వం నేటికీ కల్పించలేదని గుర్తుచేశారు.దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని.తెలిపారు.మన పక్కనే ఉన్న తమిళనాడు పొండిచేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని అన్నారు.తమిళనాడు పొండిచేరి రాష్ట్రాల్లో అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు స్వయంగా ముఖ్యమంత్రినే అంగన్వాడి వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు కానీ టిచర్లతో సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.టీచర్స్ తో సమానంగా వేతనం తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రగతి భవన్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నారని పేర్కొన్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ,5 లక్షలు హెల్పర్లకు రూ.3 లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని అనేక సంవత్సరాల నుండి అంగన్వాడి ఉద్యోగులు రాష్ట్రంలో అడుగుతున్నారని.2022 మే నెలకు అంగన్వాడీ ఉద్యోగుల 1972 గ్రాడ్యుటి చట్టం వర్తింపు చేయాలనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.అని తెలిపారు. అయినా తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు దీనివల్ల వయస్సు పైబడ్డ వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు 2017 నుండి టీఏడీఏలు ఇంక్రిమెంట్ ఇన్చార్జ్ అలవెన్స్ లు ప్రభుత్వం చెల్లించడం లేదు 2018లో కేంద్రం పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించడం లేదు కేంద్రం పెట్టిన పోషన్ ట్రాకర్ యాప్ ఉంది దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ టి ఎస్ యాప్ ను పెట్టడం వల్ల అంగన్వాడి ఉద్యోగులకు పని భారం పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. వీటితో పాటు అనేక సమస్యలతో అంగన్వాడి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఐసిడిఎస్ కు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి మినీ అంగన్వాడి సెంటర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని ఖాళీ అయిన ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రేసన్ బియ్యాన్ని శుభ్రపరచిన వెహికల్స్ ద్వారానే సప్లై చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు వనిత రాజేశ్వరి చంద్రకళ సువర్ణ సరోజ ధనలక్ష్మి లక్ష్మి అంజలి ఇందిరా సునీత ప్రాజెక్టులో ఉన్న టీచర్లు ఆయలు పాల్గొన్నారు.