కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శం

👆రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

👉మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ గారికీ వార్డ్ కౌన్సిలర్ మురళి బొక్కేతో ఘనస్వాగతం పలికారు.

గద్వాల : గద్వాల పట్టణంలోని 27 వార్డులోని నేతాజీ స్కూల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని గురువారం మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, వైస్ చైర్మన్ బాబర్ , కమిషనర్ నర్సింహా, కౌన్సిలర్ NB మురళి ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ వార్డ్ కౌన్సిలర్ కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ కేశవ్ గారు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇందులో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉంచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ స్వదినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపు మంచిగా ఉండాలని వారికి ఎలాంటి అంటకాలు కలుగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. చైర్మన్ కేశవ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు వడ్డేకృష్ణ వీరేష్, వెంకటేష్ , అల్తాఫ్ , భాస్కర్, వీరన్న, యూత్ సభ్యులు వివిధ శాఖల జిల్లా అధికారులు , వైద్యులు వైద్య సిబ్బంది , అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!