జిల్లా కృష్ణ ఆదిత్య కు వినతి పత్రం అందజేసిన ములుగు జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులు బానోతు వెంకన్న ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజర్ వర్కర్లలో జీతభత్యాల్లో కోతకు గురవుతుందని తెలుసుకున్న అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్యకు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్లకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాల మేరకు 15,600గా కనీస వేతనం నిర్ణయించినప్పటికీ, సిబ్బందికి సిబ్బందికి చెల్లించే జీవిత బత్యాల్లో ఈఎస్ఐ,పిఎఫ్ కింద చెల్లింపులు పోయినప్పటికీ కనీస వేతనం 12096 చెల్లించాలి, కానీ శానిటైజర్ సిబ్బందికి ఇచ్చే జీతం 12,096 కాకుండా కేవలం 9500 మాత్రమే ఇస్తూ శానిటైజర్ కాంట్రాక్టర్ వర్కర్ల తక్కువ మొత్తంలో జీతభత్యాలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇట్టి విషయంపై సమాచారం అందుకున్న అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న మాట్లాడుతూ సమాజంలో కార్మిక కర్షకులకు అండగా ఐ హెచ్ ఆర్ సి ఉంటుందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు ఎవరు పాల్పడ్డా ముందు వరుసలో ఉంటామని తెలిపారు.