వీధి కుక్కల స్వైర విహారం

వీధి కుక్కల స్వైర విహారం

గ్రామ సింహాలతో అగచాట్లు

స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 24, మహానంది:

మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు వీటి వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.గతంలో హెచ్ పి పెట్రోల్ బంక్ దగ్గర ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తున్న సమయంలో యువకుడు కుక్క కాటుకు గురయ్యారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాలలో కుక్కలు సంచరిస్తూ వచ్చి పోయే వాహన దారులు,పాదచారులు వెంట పడుతున్నాయి.వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!