జగనన్న భూ హక్కు సర్వే సరిహద్దుల రాళ్ల పనులు వేగవంతం చేయాలి.
— జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర..
*_జగనన్న భూహక్కు సర్వేలో భాగంగా సరిహద్దుల్లో రాళ్ల నిర్మాణం పనులు వేగవంతం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవో ఎం.ముక్కంటితో కలసి ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు,పెద్దపళ్ల,చింతలూరు,పెనికేరు గ్రామాలలో సర్పంచులతో సందర్శించి రైతుల భూముల్లో సరిహద్దుల కోసం ఏర్పాటు చేసిన భూసర్వే రాళ్లను వారు పరిశీలించారు.ముందుగా గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రకు దృశ్యాలువా కప్పి ఇండోర్ ప్లాంట్ అందించి సాధనంగా ఆహ్వానించారు.ఇంచార్జ్ తాహసిల్దార్ జె.డి.కిషోర్ బాబు,ఇంచార్జ్ మండల సర్వేయర్ ఎం.వెంకట శివ,భూ రీ సర్వే డిప్యూటీ తాహసిల్దార్ ఏమ్.జానకి రాఘవల నుండి జరుగుతున్న పనితీరుపై ఆరా తీశారు.2020 జగనన్న భూ హక్కు సర్వే రాళ్లను ల్యాండ్ పర్సన్ మెంబర్(ఎల్పిఎం) ఆధారితంగా రైతుల సమక్షంలో హద్దుల్లో వేయడం పారదర్శకంగా జరగాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే రాళ్లు వేసేటప్పుడు సంబంధిత రైతులు అందుబాటులో ఉండాలన్నారు.ఇప్పటికే తయారైన భూ స్వభావ మ్యాప్ ద్వారా రోవర్ చెకింగ్ చేస్తూ పనులు జరుగుతాయన్నారు. గతంలో ఓకే సర్వే నంబర్లో ఎక్కువ మంది రైతులు ఉండేవారన్నారు.ఇప్పుడు వారందరికీ విడివిడిగా అంటే ప్రతి రైతుకు ఎల్పిఎంలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ఎంఎన్ఆర్ఈజీఎస్,పంచాయతీ రాజ్,రెవెన్యూ,సర్వే వంటి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం సచివాలయాల పనితీరులపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి రాజ్ కుమార్,సర్పంచులు గుణ్ణం రాంబాబు,మండల వ్యవసాయ అధికారిని సోమిరెడ్డి లక్ష్మీ లావణ్య,ఇంచార్జ్ ఏపీవో ప్రసాద్,టెక్నికల్ అసిస్టెంట్ అండ్ జేఈఎఫ్ఎసి వి.కామత్ రామచంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్థాయి సర్వేయర్లు,సిబ్బంది,ఉపాధి కూలీలు పాల్గొన్నారు._*