సర్వసిద్ది పి.హెచ్.సి ఆధ్వర్యంలో “యాంటి టి.బి డే” పురస్కరించుకొని అవగాహన ర్యాలీ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో గల 8 గ్రామ సచివాలయాల్లో యాంటీ టీబీ డే ను పురస్కరించుకొని అవగాహన ర్యాలీలు ,శిబిరాలు అలాగే ఫ్రైడే.. డ్రైడే సందర్భంగా యాంటీ లార్వా ఆపరేషన్లు అవగాహన శిబిరాలు నిర్వహించినట్టు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. ఎస్. శక్తి ప్రియ తెలిపారు. అలాగే సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మరియు ఎస్.రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ఆరోగ్య విస్తరణ అధికారులు తంటపు రెడ్డి నాగేశ్వరరావు మరియు బి.సత్యనారాయణ పర్యవేక్షణలో పి.హెచ్.ఎన్…ఎం.రత్న సఖి సూచనలు తో టి.బి లక్షణాలు అయిన మూడు వారాలు మించి దగ్గు ,తరుచుగా జ్వరం , క్రమేణా బరువు తగ్గి పోవటం, ఆకలి తగ్గిపోవటం, శ్వాస తీసుకోవటం లో ఇబ్బంది, దగ్గినప్పుడు కళ్లేతో పాటు రక్తం పడడం .మున్నగు లక్షణాలతో వున్నవారు ఎవరైనా సర్వసిద్ది పి.హెచ్. సి కి వచ్చి తనిఖీ చేసుకోను నిర్ధారణ అయిన పిదప అరు నెలలపాటు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన మందులు వాడిన నయం అవుతుందనీ కావున ప్రతి ఒక్కరు అవగాహన కల్గి వుండాలని మూడు వారాలు మించి దగ్గు…కావచ్చు టి.బి ,తరుచుగా జ్వరం… కావచ్చు టి.బి అనే నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహించమని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ పి.ఎన్.వి.ఎస్ .ప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి.కొండబాబు, స్థానిక సచివాలయం హెల్త్ సెక్రటరీ పి.నూకరత్నం ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.