బడ్జెట్లో రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి ప్రభుత్వ విధానానికి నిరసనగా సిపిఎం కోడూరులో ధర్నా!!
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో కోతల విధించి ద్రోహం చేసినందుకు, ఆదానీ అవినీతికి వ్యతిరేకంగా, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టోల్ గేటు గాంధీ విగ్రహం వద్ద, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్లో కేంద్రం ప్రధా నీ నరేంద్ర మోడీ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా గాని, పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల రాయలసీమ ప్యాకేజీ నిధులు గానీ, కడప ఉక్కు పరిశ్రమ గాని, విభజన చట్టం హామీలు గాని, ప్రత్యేక హోదా గాని అమలు చేయలేదని విమర్శించారు. పేదల కడుపు నింపే ఉపాధి హామీ చట్టాన్ని సిపిఎం వాపక్షాలు తెచ్చాయని, దీనికి బడ్జెట్లో నిధులు 30 వేల కోట్ల తగ్గించి, పేదల కడుపు కొట్టి, ఈ చట్టాన్ని నిర్వేరం చేస్తున్నారన్నారు. దిగువ తుంగభద్రా కు, నిధులు కేటాయించకుండా ఎగువ తుంగభద్రా కు నిధులు కేటాయించి, రాయలసీమనుఎడారి చేయాలని బిజెపి కుట్ర పన్నిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక చట్టాలు, రద్దు చేయాలన్నారు, కనీసవేతనం, 26000 ఇవ్వాలన్నారు. అసంఘటిత కార్మికులకు, సమగ్ర చట్టం చేయాలన్నారు. రైతులకు, ఎరువుల ధరల పెంచి, అప్పుల్లో ముంచి ఆత్మ హత్యలు రెట్టింపు అయ్యాయన్నారు.ఆదానీ, బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి, ఎల్ఐసి బ్యాంకులను, ముంచేసారని తెలిపారు, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేశారన్నారు. ఆదాని ఆస్తులు జాతిని చేసి, పేదలకు పెంచాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్లోఇంత అన్యాయం జరిగితే, అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష టిడిపి, కేంద్రాన్ని నిలదీయకుండా పోరాటం చేయకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి జాన్ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యారంగానికి నిధులు కోత విధించారు అన్నారు. నూతన విద్యా విధానం పేరుతో, ఎస్సీ ఎస్టీ బీసీలకు, విద్య దూరం చేస్తున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగలుస్తానని మోసం చేశారన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జిల్లాకు మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. సిపిఎం పార్టీ మండల నాయకులు లింగాల యానాదయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం బడ్జెట్ కు ముందే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసిందని, అధిక ధరలు నియంత్రణ చేయలేదని, ప్రజల పైన పన్నులు, ట్యాక్స్లో రూపాల్లోభారాల మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కర్రతోటిహరి నారాయణ. ముత్యాల శ్రీనివాసులు, సురేంద్ర, శ్రీనివాసులు రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి డి.జయచంద్ర, సిఐటియు ఓబులవారిపల్లి మండల కార్యదర్శి కె. వెంకటరమణ, కెవిపిఎస్ మండల కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య. ఎస్ఎఫ్ఐ కోడూరు మండల అధ్యక్షులు ,జి. సందీప్, కార్యదర్శి. ఆర్ జగదీష్, వంశి, తదితరులు పాల్గొన్నారు.