ఏప్రిల్ 5న ఛలో ఢిల్లీ జయప్రదం చేయండి

స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ ఫిబ్రవరి 23

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్లతో, కార్మిక, ఉద్యోగ, రైతాంగ సంఘటిత అసంఘటిత కార్మికుల, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో అన్నీ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీఐటీయూ హమాలీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా నాయకులు వెలిశాల క్రిష్ణమాచారి పిలుపునిచ్చారు. కౌటాల మండలంలోని అంగడిబజార్ వద్ద ఆయన ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 9ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకూ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతం పెంచలేదని, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రేట్లు పెరగటానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు కారణమయ్యాయని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్పు చేసిందన్నారు. ఇలాంటి నిరంకుశ విధానాలను ప్రతిఘటించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ముంజం శ్రీనివాస్, గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతాంగాన్ని దివాళా తీస్తున్నాయని, కార్మిక వర్గాన్ని వెట్టిచాకిరికి గురిచేస్తున్నాయని అన్నారు. దేశ ప్రజలందరిపై వివిధ రూపాల్లో భారాలు మోపుతూ, దేశ సంపదను ఆదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శన, బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్, నాయకులు , పెరుగు విఠల్, గాందర్ల కిషోర్, గోడిసెల సంతోష్, ఇగురపు వెంకటి, చింతల దేవాజీ, బొడ్డు అంజన్న, సునీల్ విలాస్ ఇతరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!