వాకపాడు గ్రామ పరిధిలో ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వద్ద నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్.
అనకాపల్లి జిల్లా యస్.రాయవరం మండలం వాకపాడు గ్రామ సచివాలయం పరిధిలో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ వద్ద నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ లో భాగంగా దీర్ఘకాలిక కాలిక వ్యాధిగ్రస్తులయిన బి.పి, సుగర్, ఫిట్స్ గుండె జబ్బులు, థైరాయిడ్, క్యాన్సర్, పక్షవాతం,కిడ్నీ వ్యాధి,జ్వరాలు బారిన పడిన వారు, గర్భిణీ స్త్రీలు , బాలింతలకు తనిఖీ చేసి, రక్త పరీక్షలు నిర్వహించి,సూచనలు, సలహాలు ఇచ్చి మందులు అందజేసినట్లు ఎం.పి.హెచ్. ఒ….బి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.లిల్లీ , క్లస్టర్ హెల్త్ అసిస్టెంట్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ , స్థానిక సచివాలయం హెల్త్ సెక్రటరీ ఎం. ఆశా, 104 డి. ఈ. ఒ..అభి, 104 వాహన పైలెట్…ప్రసాద్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే మంచాన పడివున్న వృద్ధులను , స్కూల్ విద్యార్థులను, అంగన్వాడి పిల్లలను డాక్టర్ ఎన్ .వాసంతి తనిఖీ చేసి సూచనలు, సలహాలు ఇచ్చి మందులు అందజేసినట్లు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ తెలిపారు.గ్రామంలో గల దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులే కాకుండా , వాంతులు, విరేచనాలు, జ్వరాలు బారిన పడిన వారిని కూడా పరీక్షించి మందులు అందజేసినట్లు వైద్యాధికారి డాక్టర్ ఎన్.వాసంతి తెలిపారు.