నేటి నుండి స్పర్శ దర్శనాలు, రుద్ర గుండం పుష్కరిణి స్నానాలు రద్దు

నేటి నుండి స్పర్శ దర్శనాలు, రుద్ర గుండం పుష్కరిణి స్నానాలు రద్దు

మహానంది క్షేత్రములో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు: ఈవో చంద్రశేఖర్ రెడ్డి

మహానంది: సీఎం సంకల్పం న్యూస్, ఫిబ్రవరి 15,

మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లుగా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మరియు పాలకమండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహానంది క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశాలు ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాలలో వచ్చే భక్తులకు అనువుగా ఆలయానికి సమీపం లో పెద్ద నంది దగ్గర 10 ఎకరాలలో వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రసాద వితరణకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశాము మొత్తం 1,50,000 లడ్డులు తయారు చేయిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం వెహికల్ పాసులు గాని వీఐపీ దర్శనం పాసులు నిలుపుదల చేశామని తెలిపారు .భక్తులకు త్వరితగతన స్వామివారి దర్శనం పూర్తి చేసుకోవడానికి ఏడు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశామని, క్యూ లైన్ నందు మజ్జిగ, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు సప్లై చేస్తామని అన్నారు . భక్తుల కోసం అత్యవసర విభాగానికి గాను ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, నాలుగు బెడ్లు ,నాలుగు మెడికల్ క్యాంపులు, జిందాల్ నుంచి ఒకటి రెడ్ క్రాస్ మరియు తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్లు అందుబాటులో ఉంటారని,రెండు అంబులెన్సులు నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. నిరంతరం కరెంటు ఉండేటట్లుగా అదనంగా మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే శివరాత్రి మూడు రోజులు కూడా నిత్యము ఉచిత ప్రసాదం దాతల ద్వారా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సంవత్సరం కొత్తగా సాంస్కృతిక కార్యక్రమాలు పెంచామని, అందులో భాగంగా రాష్ట్ర స్థాయి చెక్కభజన పోటీలు మరియు తప్పేటగాళ్ళు కేరళ వైద్యం, చెక్కభజనలో కోలాటాలు, డ్రామాలు ఏర్పాటు చేశామని అన్నారు . అదేవిధంగా లింగోద్భావ సమయము నందు సేవా టికెట్ తో భక్తులకు దర్శన సదుపాయం కల్పిస్తామని అన్నారు. క్షేత్ర పరిధిలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాలు కూడా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్రంలో నేటి నుండి స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా రుద్రగుండం పుష్కరిణిలో నేటి నుండి భక్తులకు స్నానాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!