తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి : మాజీ మంత్రి ప్రసాద్ కుమార్
వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలో మాజీ మంత్రివర్యులు శ్రీ. గడ్డం. ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామంలో గల డా “B. R. అంబేద్కర్ మరియు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమన్ని ప్రారంభించిన ప్రసాద్ కుమార్ ప్రతి గడపకు వెళ్లి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కళా సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసైన్ మెంట్ భూములకు క్రయవిక్రయ హక్కులు కల్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలను పీడించి కార్పొరేట్ బడాబాబులకు దోచిపెడుతుందని దేశ ప్రజలు ఈ విషయన్ని గమణిస్తున్నారని తగిన సమయంలొ బుద్ది చెప్తారని బీజేపీ మతాల పేరుతో దేశాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తుందని అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాష్ట్రాన్ని అదొగతి పాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలొ సీనియర్ నాయకులు సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి,వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, కమల్ రెడ్డి, ఎంపీటీసీ అనసూజా , మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, అనంత్ రెడ్డి, జాఫర్, రఘుపతి రెడ్డి, శివయ్య, మనోహర్ గౌడ్, అయూబ్ అన్సారీ, జంగయ్య, బస్వారాజ్, హన్మంత్, శ్రీనివాస్ ముదిరాజ్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.