టూరిస్ట్ పోలీస్ కేంద్రాలు ఏర్పాటు-నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ఐపీఎస్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 12, మహానంది:
నల్లమల్ల అడవి ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మహానందీశ్వర స్వామి దేవస్థానం, అహోబిల లక్ష్మి నరసింహస్వామి దేవస్థాన పర్యాటక ప్రదేశాలలో ఏపీ టూరిస్ట్ పోలీస్ కేంద్రాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, వర్చువల్ ప్రోగ్రాం (వీడియో కాన్ఫరెన్స్ ఆన్లైన్) ద్వారా సోమవారం ప్రారంభిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదివారం తెలిపారు. మహానంది పుణ్యక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఏపీ టూరిస్ట్ పోలీస్ కేంద్రాన్ని సందర్శించి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి విచ్చేయు భక్తులు, సందర్శకులు, ప్రజల రక్షణ, మార్గనిర్దేశం చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీసు విధానం ద్వారా ఈవ్ టీజింగ్ ను అరికట్టడం జరుగుతుందని,దొంగతనాలు జరగకుండా చూడడం,దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు మరియు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు, భద్రత కనలిపిస్తామని, అసాంఘీకకార్యకలాపాలు అడ్డుకట్ట, నేరాల నియంత్రణే లక్ష్యం అన్నారు.24×7 నిరంతరం నిఘా ఉండేలా ఏర్పాట్లు చేసామని,సందర్శకులు, భక్తులు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు,నంద్యాల తాలూకా రూరల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, మహానంది ఎస్ఐ నాగర్జున రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.