సమాజ సేవలో యువత ముందుండాలి –
వైసిపి నాయకులు కొండా మధుసుధన్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 09, మహానంది:
సమాజ సేవలో యువత ముందుండాలని వైసిపి నాయకులు కొండా మధుసుధన్ రెడ్డి అన్నారు.
గురువారం మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని ఆంజనేయ కొట్టాల చెందిన రాజు అనే యువకుడు కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి యువసేన సంస్థ అధ్యక్షుడు రవితేజ, హరీష్ నిత్యవసర వస్తువులను మరియు వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి రెండు వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కొండా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు ప్రేమా నురాగాలు, ఆప్యాయతలతో పాటు మానవ త్వం, సమాజ సేవ చాలా అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, సాయి యువసేన సంస్థ సభ్యులు పాల్గొన్నారు.