స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి-సిఐటియు.
ఎంపీడీవో శివ నాగజ్యోతి కి వినతిపత్రం అందజేత
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 06, మహానంది:
స్వచ్ఛ భారత్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సిఐటియు మండల కార్యదర్శి సోమన్న, సిఐటియు జిల్లా కార్యదర్శి బాల వెంకట్, తిరుపతయ్య పేర్కొన్నారు.సోమవారం మహానంది మండల పరిధిలోని తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట స్వచ్ఛభారత్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. భారత్ కార్మికులతో మహానంది ఎంపీడీవో శివ నాగజ్యోతి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ కార్మికులు గ్రామాలలో మురికినంత శుభ్రం చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారు. కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, చేతి పంపు మరమ్మత్తులు, సచివాలయాలను శుభ్రం చేయడము గ్రామాల్లో అధికారులకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలు అందిస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు నెలనెల జీతాలు అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పనులు చెప్పి చేయించుకోవడం తప్ప స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కావున వెంటనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని జీవో 680 అమలు చేయాలని తమరిని కోరుతున్నాము. స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి, సబ్బులు, చెప్పులు, నూనె, చీపుర్లు ఇవ్వాలి. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. జీవో నెంబర్ 680 ప్రకారం రూ.10వేల వేతనం ఇవ్వాలి.గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈకార్యక్రమంలో స్వచ్ఛభారత్ కార్మికులు నారాయణ, శేఖర్ ఏసన్న ఈశ్వరయ్య, సిద్ధారెడ్డి గోపాల్ రాజు, మల్లి, కేశవ తో పాటు కార్మికులు పాల్గొన్నారు.