కాకా ఇదిగో “షాన్ దార్” నగర్… షాద్‌నగర్‌ మున్సిపల్ భవనానికి మహర్దశ

షాద్‌నగర్‌ మున్సిపల్ భవనానికి మహర్దశ

రూ. 6 కోట్లతో అన్ని సౌకర్యాలతో భవన నిర్మాణం

ఫిబ్రవరి 8న మున్సిపల్ భవనాన్ని ప్రారంభించనున్న ఎమ్మేల్యే వై. అంజయ్య యాదవ్

శరవేగంగా షాద్‌నగర్‌ అభివృద్ధి

కోట్ల నిధులు వెచ్చిస్తున్న సర్కార్‌

వేగంగా పాత జాతీయ రహదారి విస్తరణ

చటాన్‌పల్లి ఆర్‌వోబీకి నిధులు మంజూరు

మున్సిపాలిటీలో ఇదివరకే రూ. 4కోట్లతో సీసీ రోడ్డు పనులు

ప్రారంభమైన వంద పడకల దవాఖాన భవన నిర్మాణ పనులు

షాద్‌నగర్‌, : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతుంది.
తాజాగా ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ నేతృత్వంలో నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో షాద్ నగర్ నూతన మున్సిపాలిటీ విలాసవంతమైన భవనం ప్రారంభానికి సిద్ధం కావడం విశేషం. మున్సిపల్‌ వాసుల అవసరాలకు అనుగుణంగా షాద్‌నగర్‌ పట్టణంలో రూ.6 కోట్ల నిధులతో నూతనంగా మున్సిపల్‌ భవనాన్ని నిర్మించారు. పనులు పూర్తి కాగా, ప్రారంభానికి సిద్ధంగా ఉందని మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ పేర్కొంటున్నారు. మున్సిపల్‌ శాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు అనువుగా విధులను నిర్వహించేందుకు విశాలమైన గదులను నిర్మించారు. ఫిబ్రవరి 8వ తేదీన స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్వహస్తాలతో ఈ భవనం ప్రారంభానికి నోచుకోబోతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ సిటిటైమ్స్ కు తెలిపారు.

కాకా ఇదిగో “షాన్ దార్” నగర్…

ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నియోజక వర్గంలో తుది దశకు చేరుకోగా, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాలు సైతం చురుకుగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ దవాఖాన పనులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన సంగతి విధితమే. అలాగే చటాన్ పల్లి ఆర్‌ఓబీ పనుల నిధులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే విధంగా మాడల్‌ మార్కెట్‌, గ్రంథాలయ భవనం, ఆడిటోరియం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానదారుల్లో కోట్ల నిధులను వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాన పనులను అధికారులు పూర్తిచేశారు. ఇవన్నీ పరిశీలిస్తున్న జనాలు


కాకా ఇదిగో “షాన్ దార్” నగర్
అంటూ చమత్కరిస్తున్నారు.

శరవేగంగా రహదారి విస్తరణ పనులు..

పాత జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తూరు మండల కేంద్రం నుంచి షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ బైపాస్‌ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రూ. 67.75 కోట్ల నిధులతో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో దాదాపుగా రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వంతెనల నిర్మాణాలు మినహా సాధరణ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో ఈ రహదారి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ కష్టాలు, సాఫీగా ప్రయాణం సాగడంతో పాటు రోడ్డు పరిసర ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా పట్టణ ముఖ్య రహదారిలో మరిన్ని కోట్లను వెచ్చించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు.

100 పడకల దవాఖాన

100 పడకల దవాఖాన
నిర్మాణానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో రూ. 20.89 కోట్ల నిధులను వెచ్చించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫరూఖ్‌నగర్‌ మండలం అలిసాబ్‌గూడ రెవెన్యూ పరిధిలో సుమారు 5 ఎకరాల విస్తరణలో వంద పడకల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అలాగే ట్రామ కేర్‌ సెంటర్‌, డయాలసిస్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తేనున్నారు. అదే విధంగా కళాకారులకు వేదికగా ఆడిటోరియం, సకల సదుపాయాలతో షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో నూతనంగా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ. 1.88 కోట్ల నిధులతో భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పాఠకులు కూర్చునేందుకు విశాలమైన గదులతో పాటు, ఈ లైబ్రరీ గదులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారు. మండల పరిషత్‌ ఆవరణలో రూ. 5 కోట్ల నిధులను వెచ్చించి ఆధునిక సాంకేతిక విధానంతో ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. పార్కింగ్‌, థియేటర్‌, కళాకారుల ప్రదర్శన వేదిక, కళాకారులు సేద తీరేందుకు వసతులు, సౌండ్‌, లైటింగ్‌ సిస్టమ్‌ వంటి వసతులతో ఆడిటోరియం అందుబాటులోకి రానున్నది.

మోడల్‌ మార్కెట్‌..

మోడల్‌ మార్కెట్‌
మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్‌ ఆవరణలో రూ. 4.5 కోట్ల నిధులను వెచ్చించి మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఒకేచోట కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చేపలను విక్రయించేందుకు 108 దుకాణాలను నిర్మిస్తున్నారు.

ఉదృతంగా సీసీ రోడ్ల నిర్మాణం

ట్రాఫిక్‌ అధికంగా ఉండే కాలనీలలో రూ. 4.5 కోట్ల నిధులను వెచ్చించి సీసీ రోడ్లను ఏర్పాటుచేశారు. విజయ్‌నగర్‌ కాలనీ, నాగులపల్లి రోడ్డు, ఫరూఖ్‌నగర్‌ ఎస్సీ కాలనీ రోడ్డు, కోర్టు భవనం రోడ్డు, విద్యుత్‌ కాలనీ ప్రధాన రోడ్లను ఆధునీకరించారు.

త్వరలో చటాన్‌పల్లి రైల్వే వంతెన..?

ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు చటాన్‌పల్లి రైల్వే గేట్‌ వద్ద రూ. 95 కోట్ల నిధులను వెచ్చించి వంతెనను నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభవుతాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అండర్‌ పాస్‌ రోడ్డు సౌకర్యం కూడా అందుబాటులోకి రానున్నది. షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రజల కోసం శాయశక్తులా కష్టపడుతా అంటూ చెబుతూనే ఉన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం తమ వంతుగా శాయశక్తుల పని చేస్తున్న తీరు అమోఘం. పాత జాతీయ రహదారి, చటాన్‌పల్లి బిడ్జీ, ఆడిటోరియం, మాడల్‌ మార్కెట్‌, సర్కారు దవాఖాన వంటి పనులు ప్రారంభం కావడం సంతోషకరం. సీఎం కేసీఆర్‌ సహకారంతో మరిన్ని నిధులు తెచ్చేందుకు ఎమ్మేల్యే మరింత కృషి చేస్తున్నారు. ప్రజల సహకారం ఉంటే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటున్నారు అంజన్న..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!