*54 అడుగుల ప్రతిష్టాష్టకమైన శ్రీసుబ్రహ్మణ్య స్వామి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి లక్ష్మిరెడ్డి*
ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి దేవస్థానం……
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం ఊట్లవారిపల్లి పంచాయతీలోని ఆనందగిరి కొండపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టాష్టకమైన 54 అడుగుల శ్రీసుబ్రమణ్య స్వామి విగ్రహం నిర్మాణానికి చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీ రెడ్డి,ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభి రెడ్డి,జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,ఎంపీపీ,కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి చెవిరెడ్డి లక్ష్మిరెడ్డికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికి,స్వామివారి ఆలయంలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేసి,శాలువాతో ఆలయ చైర్మన్ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి,జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డిలు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,స్థానిక నాయకులు,ప్రజల సహారంతో 54 అడుగుల శ్రీసుబ్రమణ్య స్వామి విగ్రహం రాయలసీమలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా నిర్మించడం జరుగుతుందని తెలిపారు.ప్రత్యేకత కలిగిన శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శనానికి విచ్చేస్తున్నందున అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నానని తెలిపారు.విగ్రహ నిర్మాణానికి ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభి రెడ్డి,మాజీ ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద చౌదరిలు కలిసి ఒక్కొక్కరు 51 వేల రూపాయలు వంతున ఒక లక్ష రెండువేల రూపాయలు విరాళంగా అందజేశారు.భక్తులు విగ్రహ నిర్మాణానికి తమ వంతుగా విరాళాలు అందచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ తుడా చైర్మన్ ఎల్.బి.ప్రభాకర్ చౌదరి,ఆలయ కార్యనిర్వహణాధికారి మునిశేఖర్ రెడ్డి,వైఎస్ఆర్ సీపీ సంయుక్త కార్యదర్శి నంగా బాబు రెడ్డి,వైఎస్ఆర్ సీపీ మొగరాల డివిజన్ అధ్యక్షుడు మొగరాల హరిప్రసాద్ రెడ్డి,పాకాల డివిజన్ అధ్యక్షుడు కపిల్ రెడ్డి,దామలచెరువు డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు,పాకాల పట్టణ అధ్యక్షుడు రమేష్,రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మబ్బునేని రఘుపతి,మండల నరేష్ రెడ్డి,మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మునిరత్నం రెడ్డి,ప్రకాష్,సర్పంచ్ గౌరీశంకర్ రాజు,ఎంపీటీసీ సురేష్,పాకాల ఈ.ఓ మోతి,వైస్ ఎంపీపీ నాగూర్ బి రహీం భాయ్,వైఎస్ఆర్ సీపీ నాయకులు తలారి బాలశంకర్,నాగరాజ,మొగరాల నరసారెడ్డి,శ్రీరాములరెడ్డి,కేశవుల రెడ్డి,సుబ్రమణ్యం రెడ్డి,మధునాయుడు,మురళి,మధు,ఎంపీటీసీలు,సర్పంచులు,స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.