*రహదారి భద్రతా వారోత్సవాలు.*
*_రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారి భద్రతా వారోత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రావులపాలెం సర్కిల్ మండల కేంద్రమైన ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఎస్.శివప్రసాద్,మండపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లారీ యూనియన్ సభ్యులు, రోడ్డు ప్రయాణికులతో కలిసి శుక్రవారం రహదారి భద్రతా వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం జరిగే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశముపై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,సీట్ బెల్ట్ గురించి,ఆటో ఓవర్ లోడింగ్ గురించి,వాహనాలు ఓవర్ స్పీడ్ గురించి తగు సూచనలు తెలియజేస్తూ వాహనదారులు మద్యం సేవించి వాహనాన్ని నడపరాదని,సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని తెలియజేసి వివిధ అంశాలపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం లారీ యూనియన్ యాజమాన్యం ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు,ఎస్ఐ ఎస్.శివప్రసాద్ యొక్క సేవలను అభినందించి దృశ్యవాలుకప్పి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,లారీ యూనియన్ డ్రైవర్లు,ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు._*