అయిజ:జోగుళ్లాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పాత బస్టాండ్ దగ్గర గురువారం వేసిన సిసి రోడ్డును మునిసిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ…సిసి నిర్మాణం పూర్తి చేసిన మరుసటి రోజు నుండి 15 రోజుల వరకు నీళ్లు పోయాలని సిబ్బందికి సూచించారు.రోడ్డుపై ఎప్పుడు చూసినా నీళ్లు ఉండాలని,తడి ఆరకుండా చూడాలని సూచించారు.పట్టణ ప్రజలు కూడా ఇటువైపు వెళ్లే వారంతా ఈ 15 రోజులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకుని వెళ్లాలని, అప్పుడే రోడ్డు క్యూరింగ్ బాగా జరిగి ఎక్కువ కాలం మన్నిక వస్తుందని తెలిపారు.క్యూరింగ్ కాకా ముందే ద్విచక్ర వాహనాల రాకపోకల వల్ల రోడ్డుపై నిర్మించిన మడులు పోయి వాటర్ క్యూరింగ్ సరిగా జరగదని తెలిపారు.
సిసి రోడ్డును పరిశీలించిన చైర్మన్