*రోడ్డు సేఫ్టీ వారోత్సవాలు భాగంగా హెల్మెట్ ఉపయోగముపై అవగాహన సదస్సు పాకాల సీఐ రాజశేఖర్*
పాకాల
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తిరుపతి డిజిపి ఎస్పీ ఉత్తర్వులు మేరకు జనవరి 18 తేదీ నుంచి 24 వరకు రోడ్డు సేఫ్టీ వారోత్సవాలు భాగంగా హెల్మెట్ అవగాహన కల్పిస్తున్నాము అని పాకాల సిఐ రాజశేఖర్ తెలిపారు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని టూ వీలర్ పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నప్పుడు కచ్చితంగా ఇద్దరు హెల్మెట్ ధరించాలని టూవీలర్ సంబంధించిన ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ కంపల్సరిగా ఉండాలని సిఐ రాజశేఖర్
రహదారి భద్రత నియమాలను పాటిద్దాం ప్రమాదాలను అరికడదాం అని
ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నియమాలను పాటించడం వల్ల చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చునని మోటార్ వెహికల్ జాతీయ రహదారి భద్రత ఈనెల 18వ తేదీ నుండి 24వ వరకు జరుగునున్నాయి. అందులో భాగంగా పాకాల మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు మండ్రగుంట చెక్పోస్ట్ వద్ద జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సంబంధించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్సు లేకుండా వాహనాలు నడపకూడదని పూర్తిగా వాహనాన్ని నేర్చుకున్న తర్వాత లైసెన్సు పొంది వాహనం నడపాలని తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ఆ వాహనం సంబంధించి వారికి పూర్తిగా అవగాహన తెలియక పోవడంతో అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారని. అదే వారు లైసెన్సు పొందేటప్పుడు వాహనం ఏ విధంగా నడుపుతున్నాడో లేదా అని తెలుసుకొని లైసెన్సులు ఇస్తారని తెలిపారు . రోడ్డు నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చునని తెలిపారు. ఎక్కువ శాతం టర్నింగ్లలో, అతివేగంగా వెళ్లడం చాలా ప్రమాదకరమని అలాంటి చోట్ల రవాణా శాఖ హెచ్చరిక బోర్డులను పెడుతూ నిదానంగా వెళ్లాలంటూ సూచనలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే సీట్ బెల్ట్ ను కచ్చితంగా పెట్టుకోవాలని, సెల్ ఫోన్ తో మాట్లాడుతూ వాహనాన్ని నడపకూడదు అని , ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించాలని, లక్షల మంది ప్రమాదంలో గాయపడుతూ, ఇందులో ఎక్కువ శాతం మృతి చెందిన వారు ఉన్నారన్నారు, అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18 నుండి 24 తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నదని, మనమందరం కలిసి భద్రతా నియమాలను పాటించాలని సిఐ రాజశేఖర్ తెలిపారు