పోరుబాట వాల్ పోస్టర్లను విడుదల చేసిన సిపిఐ మండల కార్యదర్శి వీరప్ప

పోరుబాట వాల్ పోస్టర్లను విడుదల చేసిన సిపిఐ
మండల కార్యదర్శి వీరప్ప

స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 18, మహానంది:

మహానంది మండలంలోని ఆయా గ్రామాల జగనన్న గృహాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్న లక్ష 80 వేల రూపాయలు ఏమాత్రం సరిపోవు అని, కేవలం బేస్ మఠం లెవెల్ కు మాత్రమే సరిపోతున్నాయని సిపిఐ మండల కార్యదర్శి వీరప్ప బుధవారం అన్నారు. జగనన్న గృహాల లబ్ధిదారులకు ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతూ జరుగుతున్న ఆందోళన భాగంగా పోరుబాట వాల్ పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు జగనన్న గృహాల లబ్ధి దారులను కలిసి వారితో సంతకాలు చేపించుకున్న అర్జీలను తీసుకొని ఫిబ్రవరి 6వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాకు కలిసి తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు మహేశ్వరమ్మ, గురుమూర్తి,మద్దమ్మ, శ్రీ నగరం శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!