అభివృద్దికై ముందుకెలుతున్న కౌన్సిల్ కు అభినందనలు – ఎమ్మెల్యే భూమన
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సాదారణ కౌన్సిల్ సమావేశం బుధవారం మేయర్ డాక్టర్ శిరీషా అధ్యక్షతన, కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పాల్గొనగా, కమిషనర్ అనుపమ అంజలి అజెండాను ప్రవేశపెట్టగా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు కౌన్సిల్ అజెండాలోని అంశాలుపై చర్చించి ఆమోదించడం జరిగింది. కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్దికి నిరంతరం శ్రమిస్తూ అందరి సహకారంతో ముందుకు వెల్లడం జరుగుతున్నదన్నారు. అభివృద్ది ఆలోచనలతో ముందుకెలుతున్న కార్పొరేటర్లకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల గురించి ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఇరుకు రోడ్లు, జనసాంధ్రత ఎక్కువ కల్గిన నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు రావడం వలన నగరాభివృద్ది శరవేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఇటివల ప్రారంభించిన గెస్ట్ లైన్ రోడ్డు వలన గతంలో బస్టాండ్ కు చేరాలంటె ఒకొక్కసారి 40 నిమిషాలు పట్టెదని గుర్తు చేస్తూ నేడు 4 నిమిషాల్లో చేరుకోవడం కొత్త రహదారి అభివృద్దేనన్నారు. తిరుపతి నగరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఫిబ్రవరి 24 ను గొప్పగా అందరం కలిసి నిర్వహించాలని ఎమ్మెల్యే భూమన కోరారు. ఈ రాష్ట్రంలో కొత్త రోడ్లతో అభివృద్దికై పరుగెడుతున్న నగరంగా తిరుపతి ముందుందని, తిరుపతి నగరాభివృద్దికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే భూమన కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ నగరంలో అనేక అభివృద్ది పనులకు కౌన్సిల్ మొత్తం ఏకగ్రీవంగా కృషి చేస్తున్నదన్నారు. శెట్టిపల్లి తిరుపతి కార్పొరేషన్లో విలీనం కావడం అంశాన్ని మేయర్ శిరీష ప్రస్థావిస్తూ శెట్టిపల్లి విలీనం జరగడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శెట్టిపల్లెలో కావల్సిన అభివృద్ది పనులకు ప్రత్యేక నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు అన్ని పూర్తి చేయడంతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతుందని, ప్రజాభివృద్దికి బాటలు వేసినట్లు అవుతుందని మేయర్ డాక్టర్ శిరీష స్పష్టం చేసారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ ఆమోదంతో ప్రజాభివృద్ది పనులకే తమ ప్రాధాన్యతని, మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మిస్తే తిరుపతి ప్రజలకు ఎంతో సౌకర్యం వస్తుందని, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకెల్లడం జరుగుతుందన్నారు. అభివృద్దికై తపిస్తున్న తమ కౌన్సిల్ సహచర సభ్యులకు, అధికారులకు భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కౌన్సిల్ తీర్మానాల గురించి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసేందుకు 37 కోట్ల 61 లక్షలతో పనులను చేపట్టి ఈ మార్చి నాటికి పూర్తి చేయాలనే తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా తిరుపతి కోర్టు రహదారి, మ్యూజిక్ కాలేజ్ వద్ద ప్రీ లెప్టుల కోసం 73 లక్షలతో పనులు చేపట్టెందుకు సమ్మతం జరిగిందని, తిరుపతి అర్బన్ నివాసితులకు ఎం.కొత్తపల్లిలో కేటాయించిన ఇళ్ళలో కొండ, వాగులు వున్నందున వాటిని సరిచేసి ఇవ్వడానికి 95 లక్షలతో పనులు చేపట్టెందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, లీజులు ముగిసిన షాపులకు అద్దె పెంచి లీజు కాలాన్ని పొడిగించాలనే అంశాలను తీర్మానించడం జరిగిందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.