రైతులకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి -మండల సిపిఎం పార్టీ కార్యదర్శి వీరప్ప
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 14, మహానంది:
రైతులకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మండల సిపిఎం పార్టీ కార్యదర్శి వీరప్ప డిమాండ్ చేశారు.మహానంది మండలం నందిపల్లె గ్రామంలోని 11వ బ్లాక్ కాలువను శనివారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ 11వ బ్లాక్ నుండి అక్రమంగా తమ్మడపల్లె చెరువుకు నీటిని తరలిస్తున్నారని, ఈ విషయంపై గత సంవత్సరం కూడా సమస్య ఏర్పడగా స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చోరవతో తమ్మడపల్లె గ్రామానికి సంబంధించిన చెరువుకు హక్కులు లేని వాటికి హక్కులు కల్పించడం వలన నందిపల్లి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, 11వ బ్లాకు ముందర ఇసుక పేరుకుపోవడం వలన వెయ్యి క్యూసెక్కుల నీరు వదలడం వలన 11వ బ్లాక్ కాలువ కొద్దిస్థాయి నీరు మాత్రమే ప్రవహిస్తుందని, ఈ కొద్దిపాటి నీరు కూడ తమ్మడపల్లె చెరువుకు పోతున్నాయన్నారు. నందిపల్లె రైతులకు మాత్రం ఒక ఎకరా భూమి కూడా నీరు పారలేదని, కావున తక్షణమే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ స్పందించి 2000 క్యూసెక్కుల నీటిని వదలాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు