హర్షిత గాయత్రికి రూ.21వేల ఆర్థిక సాయం

బీఆర్ఎస్ యువ నాయకుడు నందారం అశోక్ యాదవ్

చదువుకునే వరకు ప్రతి ప్రతి ఏడాదికి సాయం చేస్తానంటూ ప్రకటన

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు అంటుంటారు.. అది ముమ్మాటికి నిజం. సాయం చేసే చేతులు ఎల్లప్పుడూ గొప్పవే.. మనసుండాలే కానీ మార్గం ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ నిత్యం భరోసా కల్పిస్తూ తన వంతు సామాజిక బాధ్యతగా ఓ యువ నాయకుడు ముందుకు వచ్చాడు. హలో షాద్ నగర్ ద్వారా నిరుపేద విద్యార్థిని హర్షిత గాయత్రి పోలను ఆదుకునేందుకు 21 వేలను వితరణ చేశారు. ఆమె చదివినంత కాలం ప్రతి ఏడాది 21 వేల రూపాయలను హలో షాద్ నగర్ గ్రూప్ ద్వారా అందజేస్తానని హామీ ఇచ్చారు. హర్షిత గాయత్రి పొలను ఆదుకుందాం అనే శీర్షికకు ఆయన స్పందించారు. నిరుపేద విద్యార్థిని వెతలను దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఈ సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో హర్షిత గాయత్రి మంచిగా చదువులో రాణించి జీవితంలో స్థిరపడ్డాక ఇతరులకు సాయం చేయాలని అశోక్ యాదవ్ సూచించారు. పెద్దమనసుతో ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయం. హలో షాద్ నగర్ ద్వారా నందారం అశోక్ యాదవ్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. హలో షాద్ నగర్ సభ్యుల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!