ప్రజల పక్షపాతి ప్రజాశక్తి దిన పత్రిక-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 06, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలోని స్వామివారి కల్యాణ మండపంలో శుక్రవారం నాడు ప్రజాశక్తి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మహానంది ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షపాతి ప్రజాశక్తి దినపత్రిక అని ప్రజాశక్తి పత్రికను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ, మహానంది మండలం వైసిపి నాయకులు భూమా సుబ్బరామయ్య మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.