తిరుమలలో “నకిలీ టికెట్ల కేటుగాళ్ల” భరతం పట్టండి!నవీన్ కుమార్ రెడ్డి

తిరుమలలో “నకిలీ టికెట్ల కేటుగాళ్ల” భరతం పట్టండి!నవీన్ కుమార్ రెడ్డి

తిరుమలలో నకిలీ టిక్కెట్ల తాకిడి ఎక్కువైంది,టీటీడీ ఎంత పగఢ్భందిగా వ్యవరిస్తున్నా అమాయక భక్తుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు!

తిరుమల తిరుపతి దేవస్థానమే ఆన్ లైన్ ఆర్జిత సేవా టికెట్లతో పాటు 300 టికెట్లు,సర్వదర్శనం ఇతరత్రా సేవా టిక్కెట్ల మంజూరుకు ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా టిటిడి సొంతంగా “శ్రీవారి దర్శన వెబ్ సైట్” ను ఏర్పాటు చేసుకొని టిక్కెట్లను విడుదల చేసే విధంగా ధర్మకర్తల మండలంలో చర్చించి అమలు చేస్తే దళారీల బెడద తగ్గుతుంది!

తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు దళారీలపై డేగ కన్ను పెట్టి జల్లెడ పడుతున్నారు కానీ తాజాగా నకిలీ టికెట్ల సంఘటనతో నకిలీ టికెట్ల కేటుగాళ్లు టిటిడి విజిలెన్స్ అధికారులకు సవాల్ విసిరారు!

తమిళనాడుకు చెందిన భక్తుల దగ్గర సుమారు 60వేలు తీసుకొని 4 తోమాల సేవ నకిలీ టికెట్లను, అద్దె గదులను ఏర్పాటు చేస్తామని చెప్పిన దళారీ మాటలు నమ్మి మోసపోయిన భక్తులను విజిలెన్స్ అధికారులు గుర్తించడంతో భక్తుల ఫిర్యాదు మేరకు నకిలీ గేటుగాళ్ల కోసం విజిలెన్స్ అధికారులు గాలింపు చేపట్టారు

శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని నకిలీ టికెట్ల కేటుగాళ్లు పంజా విసురుతున్నారు అనేక రాష్ట్రాలలో ఫేక్ వెబ్ సైట్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి!

టీటీడీ అధికారిక వెబ్ సైట్ల ద్వారానే శ్రీవారి సేవ టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు ఎప్పటికప్పుడు టీటీడీ అప్రమత్తం చేస్తున్నా…నకిలీ వెబ్ సైట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకురావడంతో ఏది “అఫీషియల్” ఏది “నకిలీ” అని గుర్తించలేని గందరగోల పరిస్థితులు భక్తులలో నెలకొంటుంది!

శ్రీవారి దర్శన నకిలీ టికెట్లతో మోసపోయిన ప్రతి భక్తుడూ విజిలెన్స్ కి పిర్యాదు చేయడంలేదు,కేసుల గోల మనకు ఎందుకులేనని చాలా మంది మిన్నుకుండి పోతున్నారు,ఒక వేల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటైపోయింది!

శ్రీవారి భక్తులను మోసగిస్తున్న నకిలీ టికెట్ల వెనక ఉన్న ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు పాల్పడాలంటే బయపడేలా ధర్మకర్తల మండలిలో కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ సమస్య తీవ్రత తగ్గదు!

శ్రీవారి భక్తులు పదేపదే దళారీలు,నకిలీ కేటుగాళ్ల చేతిలో మోసపోకుండా “సైబర్ క్రైమ్ స్పెషల్ టీం” వింగ్ ను టిటిడిలో ఏర్పాటు చేసి శ్రీవారి భక్తులు మోసపోకుండా సత్వర చర్యలు చేపట్టాలని శ్రీవారి భక్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాను

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!