మహానంది దేవస్థానం ప్రాంగణంలో ఆక్రమణలు, దురాక్రమణ లపై ప్రత్యేక కమిషన్ ఎంక్వయిరీ
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 03, మహానంది:
మహానంది దేవస్థానం ప్రాంగణంలో ఆక్రమణలు మరియు దురాక్రమాలపై ప్రత్యేక ఎంక్వైరీ కమిషన్ వేసినట్లు విశ్వసనీయ సమాచారం.గత కొన్ని సంవత్సరాల నుంచి టెండర్ వేసిన దాని కంటే ఖాళీ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తూ ఉండడంతో ప్రత్యేక అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది.ఆలయ ఆదాయానికి గండి పడడంతో పాటు ప్రైవేటు వ్యక్తులు లబ్ధి పొందడం వివాదాస్పదంగా మారడంతో కమిషన్ ఎంక్వయిరీ చేపట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అందుకు ఆలయ అధికారులు పాలకమండలి మరియు సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తుంది ..రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆలయ అభివృద్ధి కోసం అందరము పాటుపడతామని ప్రమాణం చేసిన మండలి ఎంక్వయిరీ కమిషన్ అధికారులకు సహకరిస్తుందా లేదా రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి పక్కదారి పట్టిస్తుందా అనేది తేలాల్సి ఉంది .ఎంక్వయిరీ కమిషన్ తమ నివేదికను కొద్దిరోజుల్లోపే సంబంధిత ఉన్నతాధికారులకు అందజేయాల్సి చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆలస్యం అయినట్లు తెలుస్తుంది కానీ స్థానిక అధికారులు కానీ పాలకమండలి గాని దీనిపై బహిరంగ ప్రకటన చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.ఇలాంటి విషయాలు గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీకిఒత్తిడి మేరకు వంత పాడుతార లేక ఉన్నది ఉన్నట్లు నిజానిజాలు బయట పెడతారా అనేది తేలాల్చిఉంది. ఇప్పటికే మహానంది దేవస్థానం పాలకమండలపై పలు ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి.ఇవి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తు తున్నాయి.