భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 03, మహానంది:
భూ హక్కు పత్రాలను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం రాత్రి పంపిణీ చేశారు. మహానంది మండలం బసాపురం గ్రామంలో 38 మందికి భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా సర్వే నిర్వహించి రైతులు వచ్చినా రాకపోయినా రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం భూ సర్వే నిర్వహించి భూ వివాదాలు లేకుండా చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలంలో 1920 సంవత్సరంలో సర్వే పూర్తి చేసి అప్పట్లో ఆర్ ఎస్ ఆర్ తయారు చేయడం జరిగిందన్నారు. కరణం మరియు రెడ్లు గతంలో ఇష్టం వచ్చిన రీతిలో భూ రికార్డులను తయారు చేశారని కొంతమందికి ఉపయోగ పడుతుందని ఈ సర్వే మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి రైతుకు ఎంతో ఉపయోగకరంగాఉంటుందన్నారు. ఈ సర్వేలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే మరల దరఖాస్తు చేస్తే సర్వే నిర్వహించి కొత్తగా భూ హక్కు పత్రాలను అందజేస్తామన్నారు. ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని కూడా సరిచేసి అందజేస్తారన్నారు. ప్రతి గ్రామంలో రైతుల సహకరించాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ జనార్ధన్ శెట్టి, మండల ఇన్చార్జి ఎంపీడీవో శివ నాగ జ్యోతి, ఎంఈఓ రామసుబ్బయ్య, విద్యుత్ ఏఈ ప్రభాకర్ రెడ్డి, నంద్యాల తాలూకా రూరల్ సీఐ రవీంద్ర, వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, వడుగూరి రామకృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.