మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 30, మహానంది:
మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను డి ఎం హెచ్ ఓ వెంకటరమణ బుధవారం తనిఖీ చేశారు.విద్యార్థుల వయసుకు సంబంధించి ఉండాల్సిన ఎత్తు బరువు దేహాడ్ దారుఢ్యం తదితర వాటిని పరిశీలించారు.విద్యార్థులకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ఆరా తీశారు.ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కు కొన్ని సూచనలు చేశారు.తమ వైద్య బృందం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని ఏవైనా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే తమకు కానీ తమ డాక్టర్ బృందానికి గాని తెలియజేయాలని హెచ్ఎం కు మరియు ఉపాధ్యాయులకు సూచించారు.