చేవెళ్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్
- రహదారిలో ట్రాఫిక్ నియంత్రించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకుని చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు.
- చేవెళ్ల (నవంబర్ 30 ): చేవెళ్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రహదారిపై వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రోడ్డుపై అడ్డదిడ్డంగా పెట్టిన వాహనాలను క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేవెళ్లలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ఇదే రహదారిపై వెళ్ళాలి, అదే విధంగా చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి కూడా ఇదే రహదారులపై వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలను ఉంచడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా అంబులెన్స్ కూడా అత్యవసర సమయంలో చికిత్స కోసం బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే ట్రాఫిక్ జామ్ ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులకు చలాన్ విధించడం, వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రించడంలో లేదని చేవెళ్ల పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వాసు స్పందించి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారిపై అడ్డదిడ్డంగా పెట్టిన వాహనాలను క్లియర్ చేయించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.