అయ్యప్ప స్వాముల ఇరుముడులు మాయం

అయ్యప్ప స్వాముల ఇరుముడులు మాయం

స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 29, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రానికి దర్శనార్థం వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు తిరుగు ప్రయాణంలో వారి ఇరుముడులు మాయమైన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పెడమనపురం గ్రామానికి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు ప్రైవేట్ బస్సులో మహా నందీశ్వరుని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తున్న సమయంలో టోల్గేట్ వద్దకు రాగానే ఇరుముడులను చూసుకోగా అవి కనిపించలేదని, ఎక్కడైనా పడిపోయాయా లేక ఎవరైనా దొంగలిం చారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా అదే సమయంలో ఇద్దరు చీకట్లో పరిగెత్తుతు కనిపించారని బహుశా వారే దొంగలించి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అనంతరం వారు మహానంది పోలీస్ స్టేషన్ వెళ్లి అయ్యప్ప భక్తుడు సత్యం నాయుడు ఫిర్యాదు చేయగా నంద్యాల తాలూకా సిఐ రవీంద్ర అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!