మూడు రోజుల ధ్యాన శిక్షణ తరగతులు
షాద్ నగర్, : హార్ట్ ఫుల్ నెస్ కన్హ శాంతివనం సంస్థ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలోని పతాంజలి యోగ సమితిలో మూడు రోజుల ధ్యాన శిక్షణ తరగతులు జరిగాయి అందులో సంస్థ ప్రతినిధులు ఆదినారాయణ, షరీఫ్, చక్రధర్, శ్రీనివాసులు, రాజు గౌడ్ మరియు పతాంజలి యోగా సమితి. ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. మరియు హార్ట్ ఫుల్ నెస్ కన్హ శాంతివనం వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 8:45 నిమిషాల నుండి 9:45 నిమిషాల వరకు మరియు బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు గ్రూప్ మెడిటేషన్ తరగతులు జరుగుతాయని తెలిపారు.