ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరగేక్కుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఎక్కువగా క్యాప్ లో కనిపిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ కొత్త అలవాటు గురించి ఫ్యాన్స్ మధ్య కూడా చర్చ జరుగుతుంది.
హెయిర్ లాస్ వల్లే క్యాప్ పెట్టుకుంటున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ క్యాప్ ధరించడానికి ఇదే కారణమని చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రభాస్ హెయిర్ లాస్ కు సంబంధించి కేర్ తీసుకుంటూ ఉండవచ్చని త్వరలో ప్రభాస్ మళ్ళీ మునుపటి లుక్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాలు భారతీయ సిని చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కావడం గమనార్హం.