– తెలంగాణ సర్కారకు కేంద్రం షాక్
– నోటీసులు జారీ జారీ చేసిన కేంద్రం
కేంద్రం, రాష్ట్రం మద్య రాజకీయ యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్కారుకు గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి మంజూరు చేసిన రూ. 152 కోట్లను తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంపై కేంద్రం సీరీయస్ అయిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై కేంద్రం రాష్ట్రంపై సీరియస్ అయ్యింది. ఉపాధి హామీ నిధులు దారిమళ్లింపునకు సంబంధించి జూన్ 9 నుంచి 12 మధ్య కేంద్ర బృందం.. తెలంగాణలో పర్యటించింది. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు వినియోగించినట్లు బృందం గుర్తించింది. ఉపాధి హామీ పథకం అమలులో, పనుల కేటాయింపుల్లో కూడా పలు అవకతవకలు జరిగాయని నిర్ధారించి.. ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించింది. ఉపాధి హామీ నిధులను చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫాంలు, అడవుల్లో ట్రెంచ్‌ల తవ్వకం వంటి అనుమతి లేని పనులకు తెలంగాణ ప్రభుత్వం నిధులను ఖర్చు చేసినట్లు బృందం నివేదికలో తెలిపింది. ఉపాధి హామీ (MGNREGS) నిధులను వేరే పథకాలకు దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో నిధులు చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గడువులోగా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే గ్రామీణ ఉపాధిహామీ పథకం చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.