మానవాళికి హానీ కలిగించే కొనాపర్పస్ మొక్కలను తొలగించిన సంత్ నిరంకార్
(చేవెళ్ళ)
మానవాళికి హానీ కలిగించే కోనాపర్పస్ మొక్కలను నేడు ఆదివారంనాడు చేవెళ్ళ మండల కేంద్రంలోని సంత్ నిరంకార్ వారు సత్సంగ్ కేంద్రంలో ఉన్న కోనాపర్పస్ మొక్కలను పూర్తిగా తొలగించి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ప్రపంచ దేశాలు మానవాళికి హానీ కలిగిస్తున్నాయని పూర్తిగా నిషేధించిన కోనాపర్పస్ మొక్కలు మన చుట్టుపక్కల చాలా చోట్ల పెంచిన విషయం తెలిసిందే. అయితే వీటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశాయి. కానీ… ఇంకా వీటిని తొలగించేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్న నేపధ్యంలో సంత్ నిరంకార్ వారు నిషేధిత మొక్కలను తొలగించి ముందడుగు వేశారు. మానవాళికి హానీ కలిగించే ఈ మొక్కలను అన్ని చోట్ల తొలగించి ప్రజలు అనారోగ్య భారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సంత్ నిరంకార్ వారు విజ్ఞప్తి చేశారు.